- Telugu News Photo Gallery Cinema photos Do you know who this actress is who is farming in village, She is Ratan Rajput
డిప్రషన్‌తో సినిమాలకు దూరం.. కట్ చేస్తే ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ.. ఇలా
సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస చిత్రాలతో మెప్పించిన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో జనాల హృదయాలు గెలుచుకున్నవారు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
Updated on: Nov 11, 2025 | 1:17 PM

సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస చిత్రాలతో మెప్పించిన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో జనాల హృదయాలు గెలుచుకున్నవారు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అయితే ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన తారలు..ఇప్పుడు వ్యాపారరంగాల్లో సెటిల్ అయ్యారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏడేళ్లుగా వ్యవసాయం చేస్తూ లైఫ్ గడిపేస్తుంది. ఆమె పేరు రతన్ రాజ్ పుత్. ఆమె బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

‘అగలే జనమ్ మోహే బిటియా హి కిజో’ అనే బిరుదుతో ప్రజలకు మరింత దగ్గరయ్యింది. కానీ ఇప్పుడు ఆమె నటనను వదిలేసింది. సీరియల్స్ తో పాటు, రతన్ టీవీలో తన సొంత షోను సృష్టించింది. చివరిగా సంతోషి మా సీరియల్లో కనిపించింది. 2020లో ప్రసారం అయింది. అదే సమయంలో డిప్రెషన్ కారణంగా ఆమె నటన వృత్తిని వదులుకుంది.

2018లో రతన్ తండ్రి మరణించారు. దీంతో ఆమె ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది. నెమ్మదిగా డిప్రెషన్ భారిన పడింది. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉండిపోయిన ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. నటన మానేసి ప్రశాంతమైన జీవితాన్ని ఎంపిక చేసుకుంది.

మానసిక వైద్యుడితో మాట్లాడి ముంబై వదిలి తన గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. అక్కడ ఆమె గ్రామస్తులతో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఆమె గ్రామంలో నివసిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.