- Telugu News Photo Gallery Cinema photos Do you know how much remuneration anchor Suma Kanakala gets for each show?
Suma Kanakala: యాంకర్ సుమ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవుతారు..
బుల్లి తెర పై తనదైనా మాటకారీ తనంతో స్టార్ గా ఎదిగిన యాంకర్ సుమ. స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎన్నో షోలను నడిపించి సక్సెస్ అయ్యారు. తెలుగు అమ్మాయి కాకపోయినా అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. షో ఏదైనా సరే తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు సుమ. అలాగే స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు సుమ ఉండాల్సిందే.
Updated on: Sep 18, 2023 | 1:56 PM

బుల్లి తెర పై తనదైనా మాటకారీ తనంతో స్టార్ గా ఎదిగిన యాంకర్ సుమ. స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎన్నో షోలను నడిపించి సక్సెస్ అయ్యారు. తెలుగు అమ్మాయి కాకపోయినా అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు.

షో ఏదైనా సరే తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు సుమ. అలాగే స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు సుమ ఉండాల్సిందే.

సుమ సినిమాల్లోనూ నటించారు. యాంకర్ గా రాణించడానికి ముందే సీరియల్స్ లో కనిపించరు సుమ. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా కనిపించారు సుమ కనకాల.

రీసెంట్ గా జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం బుల్లి తెరపై తన హవా చూపిస్తున్నారు సుమ కనకాల.

ఇదిలా ఉంటే సుమ ఒకొక్క షోకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సుమ ఒకొక్క షోకు , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు 2 నుంచి 2.5 లక్షల వరకు వసూల్ చేస్తున్నారని టాక్. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమ ఉంటే ఆ హుషారే వేరు.





























