- Telugu News Photo Gallery Cinema photos Do You Know Bigg Boss Telugu 9 When And Where To Watch Grand Launch
Bigg Boss 9 Telugu: బిగ్బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కొన్ని రోజులుగా ఈ షో గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. సూపర్ స్టార్ నాగార్జున ఈసారి కూడా హోస్టింగ్ చేయనున్నారు. కొన్ని నెలలుగా ఈ షోపై ఆసక్తికర బజ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో ఈ షో ప్రసారం కానుంది.
Updated on: Sep 06, 2025 | 1:30 PM

బిగ్బాస్ తెలుగు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షోలలో ఒకటి. రియాలిటీ షో సీజన్ 9తో డిజిటల్ స్క్రీన్‌లకు తిరిగి వస్తుంది. దీంతో కొన్ని రోజుల నుంచి ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి నిత్యం ఏదోక విషయం వినిపిస్తూనే ఉంటుంది.

బిగ్బాస్ తెలుగు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షోలలో ఒకటి. రియాలిటీ షో సీజన్ 9తో డిజిటల్ స్క్రీన్‌లకు తిరిగి వస్తుంది. దీంతో కొన్ని రోజుల నుంచి ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి నిత్యం ఏదోక విషయం వినిపిస్తూనే ఉంటుంది.

శని, ఆదివారాల్లో ఎప్పటిలాగే నాగార్జున ఆటాడించబోతున్నారు. ఇక ఈ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే కామన్ అడియన్స్ కోసం అగ్నిపరీక్ష నిర్వహించారు.

అగ్నిపరీక్ష ద్వారా ఐదారుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెలబ్రెటీలు, సీరియల్ తారలు సైతం అడుగుపెట్టనున్నట్లు టాక్ నడుస్తుంది. ఈసారి చాలా ట్విస్టులు ఉన్నట్లు సమాచారం.

గత సీజన్ మాదిరిగానే.. నాలుగైదు వారాలు గడిచిన తరువాత మరికొందరిని హౌస్ లోకి పంపించనున్నారట. ఇక ఈసారి సోషల్ మీడియా సెన్సేషన్స్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.




