- Telugu News Photo Gallery Cinema photos Do you know about the beautiful Actress Athulya Ravi which is going to be introduced on the Telugu screen ? telugu cinema news
Athulya Ravi: తెలుగు తెరకు పరిచయం కాబోతున్న తమిళ సోయగం.. అందాల అతుల్య రవి గురించి తెలుసా ?..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది తమిళ సోయగం అతుల్య రవి. అందంతోనే కుర్రాళ్లని కట్టిపడేస్తోన్న ఈ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి చిత్రం.
Updated on: Mar 29, 2023 | 9:28 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది తమిళ సోయగం అతుల్య రవి. అందంతోనే కుర్రాళ్లని కట్టిపడేస్తోన్న ఈ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి చిత్రం.

అయితే సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అతుల్య రవి. ఇక సినిమా తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ కావడం మాత్రం పక్కా అనేట్టుగా ఉంది ఈ అమ్మాడి అందం.

తెలుగులో సినిమాలు చేయాలని మూడేళ్ల నుంచి అనుకుంటుందట. కానీ సరైన కథ కుదరకే ఇన్నాళ్లు వెయిట్ చేసానంటోంది. కోవిడ్ సమయంలో మూడు నాలుగు స్టోరీలు విందిట. కానీ అవి డెబ్యూగా పెద్దగా సక్సెస్ కావు అన్న నమ్మకంతో వచ్చిన అవకాశాల్ని వదులుకున్నట్లు తెలిపింది.

ఇక తర్వాత మీటర్ స్టోరీలోని తన పాత్ర వ్యక్తిగతంగానూ కనెక్ట్ కావడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చేసిందట. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

ఎక్కువగా ప్రేమ కథల్లో నటించాలని చెప్పుకొచ్చింది. అలాంటి స్టోరీలు అయితే యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతాయని... రీచ్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

తెలుగులో స్టార్ హీరోలందరితో నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి దర్శక-నిర్మాతలు ఆ రకమైన అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది.

తెలుగు తెరకు పరిచయం కాబోతున్న తమిళ సోయగం.. అందాల అతుల్య రవి గురించి తెలుసా ?..




