- Telugu News Photo Gallery Cinema photos Director Sujeeth follow action drama movies with natural star nani also title is Nani32 details here Telugu Heroes Photos
Sujeeth: నానితో ప్రయోగం చేస్తున్న సుజీత్.! హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ప్లానింగ్ రెడీ.
రీసెంట్ టైమ్స్‌లో యాక్షన్ మూవీస్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు ఆడియన్స్. అందుకే మేకర్స్ కూడా ఆ జానర్ మీదే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ను మన సినిమాల్లో చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు ఓ యంగ్ డైరెక్టర్. ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్‌తోనే పాన్ ఇండియా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు సుజిత్.
Updated on: Feb 27, 2024 | 4:04 PM

రీసెంట్ టైమ్స్‌లో యాక్షన్ మూవీస్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు ఆడియన్స్. అందుకే మేకర్స్ కూడా ఆ జానర్ మీదే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ను మన సినిమాల్లో చూపించేందుకు కష్టపడుతున్నారు.

ఈ విషయంలో అందరికంటే ముందున్నారు ఓ యంగ్ డైరెక్టర్. ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్‌తోనే పాన్ ఇండియా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు సుజిత్.

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజిత్, రెండో సినిమాను ప్రభాస్ హీరోగా రూపొందించే ఛాన్స్ కొట్టేశారు అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో.

బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ తరువాత సుజిత్ దర్శకత్వంలో సాహో మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేసిన ప్రభాస్ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము కానివ్వలేదు సుజిత్.

డార్లింగ్ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. సాహో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించాయి.

ముఖ్యంగా చేంజ్ సీన్, క్లైమాక్స్ ఫైట్ ఇండియన్ ఆడియన్స్‌కు గతంలో చూడని ఓ కొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. సాహో విజువల్స్‌కు ఫిదా అయిన పవర్ స్టార్ ఇంత బిజీలోనూ సుజిత్‌కు ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో ఓజీ సినిమా తెరకెక్కుతోంది.

ఆ తరువాత చేయబోయే మూవీని కూడా ఎనౌన్స్ చేశారు ఈ యంగ్ డైరెక్టర్. నాని హీరోగా భారీ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టంట్స్ ప్లాన్ చేస్తున్నారు సుజిత్.





























