AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చిరంజీవికి విలన్‏గా యంగ్ హీరోయిన్.. బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎన్నో సవాళ్లు దాటుకుని కథానాయికగా నిలబడినవారు చాలా మంది ఉన్నారు. కానీ వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ ఇప్పటికీ సరైన బ్రేక్ సొంతం చేసుకోని తారలు గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇన్నాళ్లు హీరోయిన్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు సరికొత్తగా కనిపించేందుకు రెడీ అయ్యిందట. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Apr 22, 2026 | 9:15 PM

Share
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1 / 5
ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపల్ హయాతి ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అది కూడా సాదాసీదా పాత్ర కాదు, మెగాస్టార్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. సాధారణంగా గ్లామరస్ పాత్రలకు పరిమితమయ్యే డింపుల్, ఈ సినిమాలో విలనిజం పండించబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

2 / 5
దర్శకుడు బాబీ తన సినిమాల్లో ప్రతినాయక పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తుంటారు. చిరంజీవితో చేయబోయే ఈ సినిమాలో కూడా విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట. ఒక వైపు చిరంజీవి మాస్ మేనరిజమ్స్, మరోవైపు డింపల్ హయాతి నెగటివ్ షేడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, డింపల్ కెరీర్‌కు ఇది ఒక పెద్ద మలుపు అవుతుందని చెప్పవచ్చు.

3 / 5
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి తన ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తారని సమాచారం. మొత్తానికి, బాబీ తన మార్క్ మేకింగ్‌తో చిరంజీవిని మరోసారి వెండితెరపై పవర్‌ఫుల్‌గా చూపించడానికి సిద్ధమవుతుండగా, డింపల్ హయాతి పాత్ర ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

4 / 5
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా కాలంగా తెలుగులో వరుస సినిమాలతో అలసిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఏకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది అమ్మడు. ప్రస్తుతం డింపుల్ హయాతి.. హీరో శర్వానంద్ సరసన భోగి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

5 / 5
Follow Us
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..

బూతు పాటతో వివాదం.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా

హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు! పది, ఐటీఐతో అప్లై చేసే అవకాశం

మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?

మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..

మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే

ఎంత కష్టపడని పని చేసినా డబ్బు నిలవట్లేదా? కారణాలు ఇవే!

D-Mart: డి-మార్ట్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి ఎవరు? ఆ జీతం ఎంతో

ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం!

గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు, పెట్టుబడులకు బెస్ట్