- Telugu News Photo Gallery Cinema photos Did You Know prashanth neel and prabhas salaar 2 movie shooting update Telugu Heroes Photos
Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. సలార్2 షూటింగ్ ఎంత పూర్తయిందో తెలుసా.?
ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది శౌర్యాంగపర్వం. ఆగస్టు 10 నుంచి శౌర్యాంగపర్వం షూటింగ్ ప్రారంభం కానుంది. ఆల్రెడీ సీక్వెల్‌కి సంబంధించి 20 శాతం షూటింగ్ పూర్తయిందట. ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే ఆ భాగాన్ని తెరకెక్కించేశారట ప్రశాంత్ నీల్. ఆల్రెడీ ఫస్ట్ పార్టు కోసం వేసిన సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉంది.
Updated on: Jul 05, 2024 | 10:00 PM

ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది శౌర్యాంగపర్వం. ఆగస్టు 10 నుంచి శౌర్యాంగపర్వం షూటింగ్ ప్రారంభం కానుంది.

ఆల్రెడీ సీక్వెల్‌కి సంబంధించి 20 శాతం షూటింగ్ పూర్తయిందట. ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే ఆ భాగాన్ని తెరకెక్కించేశారట ప్రశాంత్ నీల్. ఆల్రెడీ ఫస్ట్ పార్టు కోసం వేసిన సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉంది.

అక్కడే సెకండ్ పార్టుకు సంబంధించిన ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుంది. జూన్ నుంచే ప్రారంభిస్తామని గతంలో చెప్పారు. అయితే కల్కి రిలీజ్, పృథ్విరాజ్ కాల్షీట్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆగస్టుకి షిఫ్ట్ చేశారట ముహూర్తాన్ని.

ఫస్ట్ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగుతుంది. ఓ వైపు శౌర్యాంగపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తూనే, మరోవైపు తారక్ హీరోగా డ్రాగన్‌ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఆగస్టు నుంచి నీల్ - తారక్ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే తారక్ సినిమా ఆగస్టులోనే మొదలవుతుందా? అనే అనుమానాలున్నాయి. దేవర సినిమా అక్టోబర్ 10కి రిలీజ్ అయితే, ఆగస్టులో తారక్ షూటింగ్ చేసుకోవడానికి సమయం ఉండేది. కానీ ఇప్పుడు దేవర సెప్టెంబర్‌లోనే విడుదలవుతోంది.

దీన్ని బట్టి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే నీల్ సినిమా సెట్లో అడుగుపెట్టాలి. లేకుంటే మాత్రం అక్టోబర్ నుంచే అటు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్‌గా హోంబలే, మైత్రీ మూవీస్ నిర్మాతలతో భేటీ అయ్యారట ప్రశాంత్ నీల్.

రెండు సినిమాలనూ సైమల్‌టైనియస్‌గా తెరకెక్కిస్తానని, షెడ్యూల్స్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేసుకుంటాననీ అన్నారట. అన్న మాట ప్రకారం రెండు పడవల ప్రయాణం చేసి సక్సెస్ అయితే మాత్రం సూపర్బ్ కెప్టెన్ అనే ట్యాగ్‌లైన్‌తో నీల్ దూసుకుపోవడం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.




