Lokesh Kanagaraj: లోకేష్.. ఆమీర్ కోసం కమల్‌ని పక్కనపెట్టేశారా ??
లోకేష్ ఎటు అడుగులు వేస్తారు? నార్త్ లో ప్రమోషన్ తీసుకుంటారా? సౌత్ హీరోలను పట్టించుకుంటారా? ఇంట్రస్టింగ్‌గా మారింది ఈ డిస్కషన్. దక్షిణాదిన ఆయన కోసం ఎదురుచూస్తున్న హీరోల సంఖ్య చాలానే ఉంది. మరి ఈ టైమ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ తో జర్నీ స్టార్ట్ చేస్తారా? మాట్లాడుకుందాం వచ్చేయండి... కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్ కనగరాజ్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 02, 2024 | 8:30 PM

లోకేష్ ఎటు అడుగులు వేస్తారు? నార్త్ లో ప్రమోషన్ తీసుకుంటారా? సౌత్ హీరోలను పట్టించుకుంటారా? ఇంట్రస్టింగ్‌గా మారింది ఈ డిస్కషన్. దక్షిణాదిన ఆయన కోసం ఎదురుచూస్తున్న హీరోల సంఖ్య చాలానే ఉంది. మరి ఈ టైమ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ తో జర్నీ స్టార్ట్ చేస్తారా? మాట్లాడుకుందాం వచ్చేయండి...

కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్, నాగార్జున అంటూ సీనియర్ హీరోలను ఒకచోట చేర్చి పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు కూలీని. 2025లో ప్రేక్షకులకు ది బెస్ట్ ఐ ఫీస్ట్ ఇవ్వాలని ఫిక్సయ్యారు ఈ కెప్టెన్.

కూలీ సినిమా ఇలా కంప్లీట్ కాగానే, అలా విక్రమ్ సీక్వెల్ పనుల్లో మునిగిపోతారని అనుకున్నారంతా. కమల్‌హాసన్ కెరీర్‌లో మళ్లీ యమా ఊపు తెచ్చిన సినిమా విక్రమ్. అందుకే విక్రమ్ సీక్వెల్ మీద అంత ఇంట్రస్ట్ ఉంది జనాలకు.

అయితే విక్రమ్ సీక్వెల్‌కన్నా ముందు లోకేష్ ఓ సారి నార్త్ ట్రిప్ వేస్తారన్నది వైరల్ న్యూస్. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌తో లోకేష్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సో... సితారే జమీన్‌పర్ తర్వాత లోకేష్‌తో ఆమీర్ మూవీ ఉంటుందన్నది నార్త్ మాట.

ఒకవేళ దళపతి విజయ్ 69 తర్వాత మరొక్క సినిమాకు అవకాశం ఉందంటూ కబురు పెడితే లోకేష్ ఏం చేస్తారు? ఇచ్చిన మాట ప్రకారం ఆమీర్‌తో కంటిన్యూ అవుతారా? దళపతి పెద్దగా కాల్షీట్ ఇవ్వరు కాబట్టి లియో2ని కంప్లీట్ చేస్తారా? లేకుంటే రెండూ సైమల్‌టైనియస్‌గా అవుతాయా? వీటిలో ఏది జరిగినా.. లోకేష్ డిమాండ్ మాత్రం మామూలుగా లేదన్నది అర్థం అవుతూనే ఉంది.





























