- Telugu News Photo Gallery Cinema photos Demand for glamour beauties due to shortage of heroines in the industry
Heroines: ఇండస్ట్రీలో హీరోయిన్స్ కరువాయెనే.. గ్లామర్ బ్యూటీస్ డిమాండ్..
ఇండస్ట్రీ పుష్పకవిమానంలాంటిదే. ఎంత మంది వచ్చినా ఇంకొక్కరికి కచ్చితంగా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఆ విషయం తెలిసినా గ్లామర్ అడిషన్‌కి లేట్ అవుతోంది ఎందుకని... అనే డిస్కషన్ మొదలైంది. అస్సలు దీని కారణం ఏంటి.? ఇండస్ట్రీలో హీరోయిన్స్ కరవు ఎందుకు.? ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం..
Updated on: May 10, 2025 | 11:20 AM

సీనియర్ హీరోయిన్ల గురించి మాట్లాడితే అనుష్క నుంచి మొదలు పెడతాం. తమన్నా, నయన్, త్రిష అంటూ యాక్టివ్‌గా ఉన్నవారి నుంచి మొదలుపెట్టి, కాజల్, తాప్సీ అంటూ కాస్త నెమ్మదించిన వారి వరకు లిస్టు వినిపిస్తుంది.

జస్ట్ వాళ్లేనా అంటే.. ఈ మధ్య నార్త్ లోనూ మా వాళ్లు బాగానే ట్రై చేస్తున్నారంటూ రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్‌సింగ్ లాంటివారిని మెన్షన్ చేస్తుంటారు. కానీ వీరిద్దరి నుంచి వస్తున్న సినిమాలు కూడా చాల తక్కువ. ఇవి కూడా వర్కౌట్ అవడం లేదు.

మరి ఇప్పుడు నార్త్, సౌత్‌నీ రూల్ చేస్తున్నవారి సంగతి మాట్లాడుకోవాల్సి వస్తే రష్మిక పేరును మిస్ చేసే ప్రసక్తే లేదు. రీసెంట్ టైమ్స్ లో పుష్ప 2, ఛావాలాంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, థామ సినిమాలు చేస్తుంది.

ఇండస్ట్రీలో ఫార్మ్‌లో ఉండాల్సిన పూజా హెగ్డే ఎక్కడో వెనకబడ్డారు. అనన్య పాండే, భాగ్యశ్రీ బోర్సే, కృతి శెట్టి లాంటి వారి మీద మంచి హోప్స్ ఉన్నా.. వాళ్లు తొలిమలి సినిమాలతో మెప్పించలేకపోయారు.

సో... గట్టిగా ఆరా తీస్తే ఇప్పుడు మన దగ్గర హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంది. చూడచక్కగా ఉండి, పెర్పార్మెన్స్ కి స్కోప్ ఉంటే గనుక లడ్డూ కావాలా నాయనా అంటూ అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉంది ఇండస్ట్రీ. మరి ఈ పర్ఫెక్ట్ టైమ్‌ని క్యాష్ చేసుకునేవారెవరో లెట్స్ వెయిట్ అండ్ సీ...




