- Telugu News Photo Gallery Cinema photos Comedy movies sequel like mathu vadalara, dj tillu trending now
అట్లుంటది కామెడీతోని.. కాన్సెప్ట్ ఏదైనా బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే
సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని ట్రెండ్స్ మారినా... ఎప్పుడు సక్సెస్ అయ్యే ఫార్ములా లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్‌టైనర్స్. అందుకే ఆ జానర్‌లో మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా కామెడీ జానర్‌లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్, త్రీక్వెల్స్ చేస్తూ... సక్సెస్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా, మత్తువదలరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.
Updated on: Sep 24, 2024 | 2:04 PM

సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని ట్రెండ్స్ మారినా... ఎప్పుడు సక్సెస్ అయ్యే ఫార్ములా లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్‌టైనర్స్. అందుకే ఆ జానర్‌లో మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా కామెడీ జానర్‌లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్, త్రీక్వెల్స్ చేస్తూ... సక్సెస్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు.

రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా, మత్తువదలరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ మత్తువదలరా 2తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో త్రీక్వెల్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు మేకర్స్.

కామెడీ ట్రెండ్‌ను పర్ఫెక్ట్‌గా కంటిన్యూ చేస్తున్న మరో హీరో సిద్ధూ జొన్నలగడ్డ. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో సంపాదించుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకే ఎన్ని సినిమాలు చేసినా... టిల్లు క్యారెక్టర్‌ను మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు. టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావటంతో త్వరలో టిల్లు క్యూబ్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు.

బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు కూడా కామెడీ సిరీస్‌లను కంటిన్యూ చేస్తున్నారు. ఓ వైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కామెడీ జానర్‌లోనూ హిట్‌లు కొడుతున్నారు.

అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న గోల్‌మాల్, అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న హౌస్‌ఫుల్, వెల్ కమ్, హెరా ఫెరీ, జాలీ ఎల్ఎల్‌బీ లాంటి సిరీస్‌లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆ ఫ్రాంచైజీలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్.




