- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi and Nagarjuna attend Srikanth Kidambi Shravya Varma wedding reception, See photos
Shravya varma: గ్రాండ్‌గా కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల వెడ్డింగ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగ్.. ఫొటోస్ ఇదిగో
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేన కోడలు సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహసంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
Updated on: Nov 11, 2024 | 6:37 PM

టాలీవుడ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ ల వివాహం హైదరాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 11) అట్టహాసంగా జరిగింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కీర్తి సురేష్ తదితరులు హాజరయ్యారు.

తాజాగా శ్రీకాంత్- శ్రావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అలాగే సందీప్ కిషన్, అడివి శేష్, కొణిదెల నిహారిక, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తదితరులు శ్రావ్య- శ్రీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తళుక్కుమన్నారు.

ఇక ప్రస్తుతం పుష్ఫ 2 షూటింగ్ లో బిజీగా ఉంటోన్న డైరెక్టర్ సుకుమార్ వీడియో కాల్ ద్వారా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం శ్రావ్య వర్మ- కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.





























