- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Rajamouli Movie SSMB29 Target 2000 crore in Indian Film Industry, Details Here
SSMB29: పెద్ద టార్గెట్టే.! ఈసారి జక్కన్న దెబ్బతో ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.!
రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై బయటి నుంచి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటుంటే.. ఆయనెన్ని ఇంకెన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి.? అందుకే SSMB 29 అంచనాలకు అందదు.. ఊహకందదు.! తాజాగా SSMB 29 కోసం మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు జక్కన్న. అది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు. SSMB 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచ సినిమా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్.
Updated on: Nov 11, 2024 | 5:58 PM

రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై బయటి నుంచి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటుంటే.. ఆయనెన్ని ఇంకెన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి.? అందుకే SSMB 29 అంచనాలకు అందదు.. ఊహకందదు.!

మహేష్, రాజమౌళి సినిమాపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంపై వచ్చిన గాసిప్.. రెండు భాగాలు కాదు ఒకే భాగంగా SSMB29 రాబోతుందని.!

దాన్ని ప్లాన్ చేయడం కూడా అలాగే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి రానుంది. నిన్నమొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లన్నారు కానీ దాని స్థాయి అక్కడ లేదు.

బాహుబలి సిరీస్‌తో 2400 కోట్లు.. ట్రిపుల్ ఆర్‌తో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి.. మహేష్ బాబు కోసం అంతకుమించే ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా..! ఇప్పుడిదే జరగబోతుంది. SSMB29 కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచే రానున్నారు.

ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్‌లో SSMB29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది. SSMB29 బడ్జెట్ అంతా అనుకుంటున్నట్లు 500 కోట్లు కాదని.. కనీసం 1000 కోట్లు అవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇంతవరకు ట్రై చేయని డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు మహేష్. ఈ సారి నేషనల్ లెవల్‌లో కాదు గ్లోబల్ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.

బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు.. బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB29తో హాలీవుడ్‌లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు.

ఇదే జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతుంది. ఇక SSMB29తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహకందదేమో..?




