- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela joins sets of Allu Arjun Pushpa 2 the rule, Photos viral
Sreeleela-Pushpa 2: పుష్పరాజ్ రేంజ్ ని ఉన్నపళంగా హైప్ తెచ్చిన శ్రీలీల.! ఎలా అంటే.?
నిన్నమొన్నటిదాకా ఎవరూ.. ఇంకెవరు? అంటూ ఊరించిన విషయం మీద ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. గత రెండేళ్లుగా ఎంత మంది భామల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి యూనిట్ అంతా కలిసి శ్రీ లీలను చూసి ఊ.. అన్నట్టు సమాచారం.. ఏంటి.. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు అర్థమయ్యే ఉంటుందిగా.. ఇంకెందుకు ఆలస్యం.! అదీ సంగతి.. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..
Updated on: Nov 12, 2024 | 12:42 PM

నిన్నమొన్నటిదాకా ఎవరూ.. ఇంకెవరు? అంటూ ఊరించిన విషయం మీద ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. గత రెండేళ్లుగా ఎంత మంది భామల పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరికి యూనిట్ అంతా కలిసి శ్రీ లీలను చూసి ఊ.. అన్నట్టు సమాచారం..

ఏంటి.. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు అర్థమయ్యే ఉంటుందిగా.. ఇంకెందుకు ఆలస్యం.! అదీ సంగతి.. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. అంటూ పుష్పరాజ్‌తో కలిసి సమంత వేసిన స్టెప్పులను ఇన్నేళ్ల తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు జనాలు.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో అంతగా పాపులర్ అయింది ఆ సాంగ్. పుష్పరాజ్‌కి ప్రీ రిలీజ్ టైమ్‌లో ఉన్నపళంగా ఊపు తెచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఊ అంటావా అని ఎవరంటారు?

అని ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నారు జనాలు. రకరకాల పేర్లు వినిపించాయి. మొన్న మొన్నటిదాకా శ్రద్ధాకపూర్ పేరు కూడా మారుమోగింది. అయితే.. ఇప్పుడు వారందరి స్థానాన్ని కొల్లగొట్టేశారు శ్రీలీల.

ఈ ఏడాది మహేష్‌తో ఆమె స్క్రీన్ మీద ఆడిపాడారు. చేతిలో రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. కొత్తగా అయితే, శ్రీలీల ఇప్పటిదాకా ఇంకే సినిమానూ ఒప్పుకోలేదు.

గోట్‌లో స్పెషల్ సాంగ్ చేస్తారనే వార్తలొచ్చినా.. అందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా అల్లు అర్జున్‌తో స్టెప్పులేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ స్టెప్పులు ఎలా ఉంటాయో స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు.

డ్యాన్సులంటే ముందూ వెనకా చూసుకోకుండా దూకేసే లేడీ శ్రీలీల. వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద ఎలాంటి ఫైర్ పుట్టిస్తారో చూడటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు.




