- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress in this photo, Who Acted 800 Crore Collection Movie, She Is Rukmini Vasanth
Tollywood: ఒక్క సినిమాతోనే సంచలనం.. కట్ చేస్తే.. 800 కోట్లతో హీరోయిన్ సెన్సేషన్.. ఈ అమ్మడు ఎవరంటే..
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన ముద్దుగుమ్మ.
Updated on: Nov 18, 2025 | 8:30 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. సప్త సాగరాలు దాటి సినిమాతో హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు కాంతారతో మరో విజయాన్ని అందుకుంది.

ఇటీవలే కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రుక్మిణి భారతదేశం అంతటా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. యువరాణిగా ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రిషకు గట్టి పోటీ ఇచ్చే నటి ఆమె అని భావించారు.

కర్ణాటకలోని బెంగళూరలో జన్మించింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. తల్లి భరతనాట్య నృత్యకారిణి. ఉన్నత విద్యను లండన్ లో పూర్తి చేసింది రుక్మిణి. 2019 లో విడుదలైన కన్నడ చిత్రం 'బ్రైబల్ ట్రైలజీ' ద్వారా ఆమె నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం విడుదలైన హిందీ చిత్రం 'అప్‌స్టార్ట్స్' లో నటించింది.

2023లో రక్షిత్ శెట్టి సరసన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే ఆమె నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా రూ.800 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది.




