- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress Her Movies flopped, She Is Kavya Thapar
Tollywood: ఆఫర్స్ వచ్చినా కలిసిరాని అదృష్టం.. చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు బ్యూటీ సైలెంట్..
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ కొందరు ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాదు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ కావడంతో దెబ్బకు సైలెంట్ అయ్యింది.
Updated on: May 09, 2025 | 11:37 AM

2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కావ్య థాపర్. తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి వరుస్ ఆఫర్స్ వచ్చాయి.

ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అందుకుంది. 2021లో ఏక్ మినీ కథ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీలో మిడిల్ క్లాస్ లవ్ చిత్రంలో నటించింది.

ఆ తర్వాత తమిళంలో పిచ్చైకారన్ 2 (తెలుగులో బిచ్చగాడు 2) చిత్రంలో నటించింది. ఈ సినిమాతోపాటు ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

అయితే కావ్య నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు.

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే గ్లామర్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.




