- Telugu News Photo Gallery Cinema photos Bollywood heroine getting success in Tollywood industry, hit Telugu heroines not getting much success Telugu Heroines Photos
Heroines: బీ టౌన్ వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు.. అక్కడ మన హీరోయిన్స్ మాటేంటి.?
కొత్తగా ఓ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడుతుంటే, ఫస్ట్ సినిమా ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ లిట్మస్ టెస్ట్ లో పాస్ అయ్యారు దీపిక పదుకోన్. వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది ఆమె నటించిన కల్కి సినిమా. ఫస్ట్ సినిమాతో పెద్దగా క్లిక్ కాలేకపోయినా, ఇప్పుడు కల్కితో దిశా పాట్ని కూడా మంచి హిట్ అందుకున్నట్టే. ద్వితీయ విఘ్నం లేకుండా కంగువతోనూ గట్టెక్కాలనే తపనే కనిపిస్తోంది మిస్ దిశలో..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Janardhan Veluru
Updated on: Jul 09, 2024 | 3:18 PM

కొత్తగా ఓ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడుతుంటే, ఫస్ట్ సినిమా ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ లిట్మస్ టెస్ట్ లో పాస్ అయ్యారు దీపిక పదుకోన్. వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది ఆమె నటించిన కల్కి సినిమా.

ఫస్ట్ సినిమాతో పెద్దగా క్లిక్ కాలేకపోయినా, ఇప్పుడు కల్కితో దిశా పాట్ని కూడా మంచి హిట్ అందుకున్నట్టే. ద్వితీయ విఘ్నం లేకుండా కంగువతోనూ గట్టెక్కాలనే తపనే కనిపిస్తోంది మిస్ దిశలో. సెప్టెంబర్‌లో దేవర మూవీతో సౌత్‌లో సక్సస్‌ఫుల్ గర్ల్ గా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు జాన్వీ కపూర్.

నార్త్ భామలు సినిమాలు వరుసగా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. అంతే కాదు, నార్త్ లో హల్‌చల్ చేయడానికి రెడీ అవుతున్న సౌత్ హీరోయిన్ల మీద కూడా మంచి ఫోకస్ పెరుగుతోంది. ఒకరికి నలుగురు హీరోయిన్లు ఇప్పుడు ఉత్తరాది వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు.

సౌత్‌లో డ్యాన్సులతో రౌడీ బేబీ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్ లో బిజీ అవుతున్నారు. ఓ వైపు జునైద్ ఖాన్‌తో లవ్‌స్టోరీలో నటిస్తున్నారు. మరోవైపు నితీష్ తివారి రామాయణంలో సీతమ్మతల్లిగా చేస్తున్నారు. లేడీ పవర్‌స్టార్ పల్లవి..

ప్రస్తుతం చేతిలో ఉన్న సౌత్ సినిమాలను త్వరగా కంప్లీట్ చేసుకుని, భవిష్యత్తు అంతా నార్త్ లోనే డిజైన్ చేసుకుంటారా? లేకుంటే అటూ ఇటూ బ్యాలన్స్ చేసుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త ప్లేస్‌కి చటుక్కున వెళ్లడానికి ఇష్టపడటం లేదు కీర్తిసురేష్.

బాగా పరిచయం ఉన్నవారికి వెంటపెట్టుకుని వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆమె ప్రస్తుతం నార్త్ లో బేబీ జాన్‌లో నటిస్తున్నారు. తెరికి రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. నార్త్ మేకర్స్ తో కలిసి అట్లీ దంపతులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్ 25న బేబీ జాన్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే టెన్షన్ కనిపిస్తోంది కీర్తీ సురేష్‌లో.

ఈ సినిమా సక్సెస్‌ని బట్టే కీర్తి నార్త్ జర్నీ మీద ఓ క్లారిటీ వస్తుంది. తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన అనతికాలంలో అద్భుతమైన పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల. ఈ ఏడాది ఆల్రెడీ గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ. వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అవుతున్నారు.

చార్మింగ్ ఫేస్, యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ ఎబిలిటీ మెండుగా ఉన్న ఈ బ్యూటీకి సరైన సక్సెస్ ఒకటి పడాలేగానీ, నార్త్ లో ఓ సక్సెస్‌ఫుల్ ట్రిప్ ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో చేసిన ప్రతి సినిమాకీ పాజిటివ్ బజ్ తెచ్చుకున్నారు నటి సంయుక్త మీనన్.

సౌత్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నార్త్ లో కాజోల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మహారాజ్ఞితో నార్త్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఈ మలయాళ లేడీ.



















