- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Contestant Actress Pavani Reddy and Amir Tie The Knot, Wedding Photos Goes Viral
Tollywood: మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోస్ వైరల్..
బుల్లితెరపై నటిగా మంచి మార్కులు కొట్టేసింది. సీరియల్లో అమాయకమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి మెప్పించింది. అలాగే బిగ్ బాస్ షోతో పరిచయమై దాదాపు మూడేళ్లు ప్రేమలో ఉన్న ఓ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. ?
Updated on: Apr 20, 2025 | 6:06 PM

బుల్లితెరపై ఆమె ఫేమస్ నటి. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ వెండితెరపై సందడి చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది. ఆమె మరెవరో కాదు.. పావని రెడ్డి.

పావని రెడ్డి.. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 వంటి చిత్రాల్లో నటించి వెండితెరపై సందడి చేసింది.

తాజాగా ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొన్న పావని.. అదే షోలోని కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అమీర్ ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

మొదట అమీర్ ప్రపోజ్ చేయగా.. కొన్నాళ్లు దూరం పెట్టిన పావని.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు ఏప్రిల్ 20న పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

అమీర్ ముస్లీం అయినప్పటికీ అమ్మాయి ఇష్ట ప్రకారం హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. నిజానికి పావనికి గతంలో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.




