- Telugu News Photo Gallery Cinema photos Balakrishna Daku Maharaj to Adhi Sai Kumar Shambala latest movie updates from film industry
Movie updates: డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకూ మహరాజ్. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ నుంచి అప్డేట్. నోయెల్ పాడిన తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్. హీరో ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా శంబాల ఫస్ట్ లుక్.
Updated on: Dec 24, 2024 | 2:55 PM

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా డాకూ మహరాజ్. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. అందులో బాబీ, నాగవంశీ పాల్గొన్నారు. సినిమా విషయాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు నాగవంశీ.

తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్.

కన్నడ స్టార్ హీరో సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ ట్రైలర్ విడుదలైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సంయుక్త, సుకృత, సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ట్రైలర్ పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగింది.

డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో నోయెల్ పాడిన తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ వేడుకలో నోయెల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.

హీరో ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా శంబాల ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. చాలా కాలంగా బ్రేక్ తీసుకున్న ఈయన.. కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నానని తెలిపారు. శంబాల కచ్చితంగా ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. సైకిల్‌పై వస్తున్న లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.





























