- Telugu News Photo Gallery Cinema photos Balakrishna Aditya 369 Re release to Siddu Jonnalagadda Jack latest film updates from industry
Movie Updates: ఆదిత్య 369 రీ రిలీజ్ ముచ్చట.. జాక్ ట్రైలర్‌లో బూతులపై క్లారిటీ..
టాలీవుడ్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. జాక్ మూవీ ట్రైలర్‌లో వినిపించిన బూతులపై క్లారిటీ ఇచ్చారు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. రిటైర్మెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. టాక్సిక్ సెట్‌లో జాయిన్ అయిన నయన్. అక్షయ్ కుమార్, మాధవన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ కేసరి ఛాప్టర్ 2.
Updated on: Apr 05, 2025 | 1:59 PM

టాలీవుడ్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. రీ మాస్టర్ చేసిన వర్షన్‌ను శుక్రవారం రీ రిలీజ్ చేసారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీకి సింగీతం శ్రీనివాస్ దర్శకుడు. 1991లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రీ రిలీజ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

జాక్ మూవీ ట్రైలర్‌లో వినిపించిన బూతులపై క్లారిటీ ఇచ్చారు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. క్లైమాక్స్ ఎపిసోడ్ కావటంతో హీరో ఉన్న ఎమోషన్‌కి అలాంటి డైలాగ్స్ కరెక్ట్ అనిపించే పెట్టామని, సినిమా చూసిన తరువాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని చెప్పారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జాక్, ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిటైర్మెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. తనకు 75 ఏళ్లు వచ్చిన తరువాత కూడా నటిగా కొనసాగాలనుందన్నారు. ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే అన్న కరీనా, వయసు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అన్నారు.

ముంబైలో జరుగుతున్న టాక్సిక్ షూట్‌లో జాయిన్ అయ్యారు నయనతార. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారుయ మేకర్స్. ఈ సినిమాను 2026 మార్చి 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్, మాధవన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ కేసరి ఛాప్టర్ 2. జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్, సినిమా కథా కథనం విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.





























