Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 07, 2024 | 12:50 PM
తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు మన హీరోలు.. ఇంకాస్త బాగుంటే థౌజెండ్ వాలా పేల్చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ చూసిన పీక్స్ కంటే.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా బెటర్ పొజిషన్‌లో ఉంది. అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ చేస్తున్నారిప్పుడు. అంత ధైర్యమేంటి అనుకోవచ్చు.. కానీ వాళ్ల ప్లాన్స్ వాళ్లకున్నాయి.
పాన్ ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే.. ఎందుకంటే కాంతార, కేజియఫ్ మినహాయిస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాలే.
తమిళం నుంచి విక్రమ్, పొన్నియన్ సెల్వన్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కవుట్ అవ్వలేదు. కేవలం తెలుగు, తమిళంలోనే విజయం సాధించాయే కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటి వరకు సత్తా చూపింది లేదు.
ఈ మధ్య మన పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ కల్కి, యాక్షన్ ఎంటర్టైనర్ దేవర, పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ లాంటి వాటితో దండయాత్రకు రెడీ అవుతున్నారు మన హీరోలు.
ఇప్పుడు ఫస్ట్ టైమ్ తమిళ హీరోల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. దానికి అక్కడున్న కంటెంటే కారణం. కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు సూర్య హీరోగా చేస్తున్న కంగువాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
లియోతో సంచలనం సృష్టించిన విజయ్.. సైన్స్ ఫిక్షన్ గోట్ సినిమాతో వస్తున్నారు. అలాగే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వెట్టైయాన్‌తో పాటు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న స్మగ్లింగ్ డ్రామా సినిమా కూడా ఉంది.