- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Shares Latest Beautifull Crazy Look Photos
Anupama Parameswaran: ఆ అందానికి ముగ్దులు అవ్వాల్సిందే.. మతిపోగొట్టేస్తోన్న అనుపమ.. ఫోటోస్ వైరల్..
అనుపమ పరమేశ్వరన్... సాత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ ఏడాది అనుపమ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Oct 07, 2025 | 12:09 PM

2015లో ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో హీరోయిన్ కాదు.. కేవలం ఐదు నిమిషాల స్క్రీన్ స్పేస్ కూడా లేని అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది.

ఆ తర్వాత తెలుగులో అఆ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇందులోనూ హీరోయిన్ పాత్ర కాదు. శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

మలయాళంలో ప్రేమమ్ సినిమా తర్వాత ఆమెకు పూర్తి నిడివి ఉన్న పాత్ర రాలేదు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇటీవల జానకి వర్సెస్ కేరళ సినిమాలో నటించింది. విడుదలకు ముందే ఈ మూవీ వివాదాల్లో చిక్కుకుంది.

ఇటీవలే తెలుగులో కిష్కింధపురి, పరదా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మోడ్రన్ చుడిధార్ లో.. రింగుల జుట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అనుపమ లేటేస్ట్ ఫోటోస్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు.




