నాగార్జున సంగతి పక్కనబెడితే.. చైతూ, అఖిల్ పరిస్థితి దారుణంగా ఉందిప్పుడు. ఇప్పటికీ మీడియం రేంజ్‌లోనే ఆగిపోయారు నాగ చైతన్య. ఎన్ని విజయాలొచ్చినా ఈయన మార్కెట్ 30 కోట్లు మించలేదు. కస్టడీకి 10 కోట్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ప్రస్తుతం చందూ మొండేటితో తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారీయన. దీనిపైనే చైతూ ఆశలన్నీ ఉన్నాయి. దీని బడ్జెట్ 70 కోట్లకు పైగానే ఉందని అంచనా.