పాజిటివ్ టాక్ తో యానిమల్.. మిగతా సినిమాల సంగతేంటి ??
మెజారిటీ జనాలు వారెవా సూపర్ అని అన్నప్పుడు వచ్చే కిక్కే వేరప్పా అని అంటున్నారు యానిమల్ టీమ్. ప్యాన్ ఇండియా వైడ్ పాజిటివ్ బజ్‌తో మంత్‌ని మొదలుపెట్టింది డిసెంబర్. ఇప్పుడు ఈ సక్సెస్ రిలేని క్యారీ చేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు మిగిలిన హీరోలు. హాయ్ నాన్నా అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు నానీ. నెక్స్ట్ తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వస్తోంది హాయ్ నాన్న. ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్‌లో చాలా కీలకం. హాయ్ నాన్న రిలీజ్ అయిన నెక్స్ట్ డే... అంటే, డిసెంబర్ 8న రిలీజ్‌కి రెడీ అవుతోంది ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కి ఈ సినిమా క్రూషియల్.