చిరంజీవి సైతం ఒక్క సినిమా అనుభవం ఉన్న వశిష్టతో సోషియో ఫాంటసీ చేస్తున్నారు. దీని బడ్జెట్ 200 కోట్లు. తమిళంలోనూ లోకేష్ కనరాజ్, నెల్సన్, అట్లీ లాంటి కుర్ర దర్శకుల హవా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ల మేకింగ్‌తోనే విక్రమ్, జైలర్ అన్ని వందల కోట్లు వసూలు చేసాయి. మొత్తానికి నాటి హీరోలతో.. నేటి దర్శకుల మాయ కొనసాగుతుంది.