Anasuya Bharadwaj: ఈ మాటలకే నేను షో వదిలేసి వెళ్ళిపోయా..! అతని పై అనసూయ ఫైర్
అందాల యాంకరమ్మ అనసూయకు ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది.
Updated on: Jul 17, 2025 | 1:43 PM

అందాల యాంకరమ్మ అనసూయకు ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది.

ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ రాణిస్తుంది. రంగస్థలం సినిమా అనసూయ డిమాండ్ పెంచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.ఇక ఈ అమ్మడు తన పై జరిగే ట్రోల్స్ పై కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. తన పై ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసినా.. పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టినా ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంది అనసూయ.

తాజాగా అనసూయ జబర్దస్త్ స్టేజ్ పై మరోసారి సందడి చేసింది. జబర్దస్త్ షో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకలో అనసూయ పాల్గొంది. మళ్లీ పాత బ్యాచ్ అంతా ఈ ప్రోగ్రాం లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

తాను జబర్దస్త్ ఎందుకు వదిలేశానో చెబుతూ హైపర్ ఆదిపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి."నీ వల్లే నేను ఈ షోను వదిలి వెళ్ళాను. నీ స్కిట్‌లకు నేను సపోర్ట్ ఇచ్చి, నిన్ను ప్రోత్సహిస్తే, నువ్వు నాకు గుర్తింపు ఇవ్వలేదు. షోను వదిలి వెళ్లే ముందు కూడా నీతో ఆది, వద్దు.. వద్దు.. నాకు కొన్ని నచ్చడం లేదు అని చాలా బ్రతిమిలాడా. అయినా వినలేదు" అంటూ ఎమోష్నలైంది అనసూయ.




