Rajeev Rayala |
Updated on: Jan 29, 2024 | 2:02 PM
యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత యాంకర్ గా మారింది.
యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. సుకుమార్ రంగస్థలం సినిమా ఈ అమ్మడి రేంజ్ ను మార్చేసింది.
రంగస్థలం సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి.చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమాల్లో నటించింది.
తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు ఓకే చేస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అనసూయ. గోవాలో చక్కర్లు కొడుతూ కొన్ని క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది అనసూయ.