- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Chief Guest For Mangalavaram Pre Release Event, Bhagavanth Kesari Success Celebrations
Tollywood News: మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. భగవంత్ కేసరి సక్సెస్ సంబరాలు
నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో జోరు మీదున్నారు. ఈ మధ్యే ఈయన నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. దసరాకు విడుదలైన సినిమాకు 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అఖండ, వీరసింహా రెడ్డి తర్వాత వరసగా మూడోసారి సెంచరీ కొట్టారు బాలయ్య. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సంబరాలు చేసుకున్నారు యూనిట్. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ తన పరంవా స్టూడియోస్ సంస్థపై స్వయంగా నిర్మిస్తున్న సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఇప్పటికే రిలీజ్ అయిన సైడ్ ఏ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Updated on: Nov 10, 2023 | 9:35 PM

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో జోరు మీదున్నారు. ఈ మధ్యే ఈయన నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. దసరాకు విడుదలైన సినిమాకు 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అఖండ, వీరసింహా రెడ్డి తర్వాత వరసగా మూడోసారి సెంచరీ కొట్టారు బాలయ్య. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సంబరాలు చేసుకున్నారు యూనిట్.

Sapta Sagaralu Dhaati: రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ తన పరంవా స్టూడియోస్ సంస్థపై స్వయంగా నిర్మిస్తున్న సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఇప్పటికే రిలీజ్ అయిన సైడ్ ఏ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సైడ్ బి మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమా విశేషాల గురించి మీడియాతో ముచ్చటించారు చిత్రయూనిట్. నవంబర్ 17న విడుదల కానుంది సప్త సాగరాలు దాటి సైడ్ బి.

Dhruva Nakshatram: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా ధృవ నచ్చతిరమ్. తెలుగులో దీన్ని ధృవ నక్షత్రం పేరుతో విడుదల చేస్తున్నారు. ఆరేళ్లుగా విడుదల కాకుండా ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది ధృవ నక్షత్రం.

Mangalavaram: ఆర్ఎక్స్ 100, మహాసముద్రం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమా మంగళవారం. పాయల్ రాజ్‌పుత్, రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్నారు. నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంగళవారం విడుదల కానుంది. నవంబర్ 11న హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. ఈ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలపై ప్రకటన చేసారు మేకర్స్. వెరీ సూన్ అంటూ పోస్టర్ విడుదల చేసారు. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది.




