- Telugu News Photo Gallery Cinema photos All the films starring Rakul Preet Singh are flopping lately
సీక్వెల్స్ రకుల్‌కు కలిసి రావడం లేదా..? నెటిజన్స్ ఏమంటున్నారంటే..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఆతర్వాత వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుంది.
Updated on: Jul 24, 2024 | 9:32 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఆతర్వాత వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుంది.

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలు, యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది

తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది ఈ వయ్యారి భామ. . తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాలో మెరిసింది.

రకుల్ ప్రీత్ సింగ్ హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది. పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

రకుల్ కు సీక్వెల్స్ కలిసి రావడం లేదు అని అంటున్నారు. రవితేజ నటించిన కిక్ 2, నాగార్జున నటించిన మన్మధుడు 2, రీసెంట్ గా భారతీయుడు 2 ఈ మూడు సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా చేసింది. మూడు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.




