- Telugu News Photo Gallery Cinema photos Aishwarya Lekshmi Childhood Photos Goes Viral On Social Media
Tollywood: చిన్నప్పుడు సో స్వీటూ.. ఇప్పుడేమో యమ హాటూ.. ఈ వయ్యారి ఎవరో కనిపెట్టగలరా.?
ఈ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కనిపెట్టారా.? తమిళ కుట్టి అండీ బాబూ..! మొన్నీమధ్యే పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. అలాగే ఇటీవల కుస్తీ నేపధ్యం ఉన్న సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
Updated on: Aug 22, 2024 | 8:34 PM

ఈ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కనిపెట్టారా.? తమిళ కుట్టి అండీ బాబూ..! మొన్నీమధ్యే పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. అలాగే ఇటీవల కుస్తీ నేపధ్యం ఉన్న సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆమెవరో కనిపెట్టగలిగారా.? లేక మేమే చెప్పేస్తాం.

ఆమె మరెవరో కాదు ఐశ్వర్య లక్ష్మీ. 1991 సెప్టెంబర్ 6న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది ఈ అందాల భామ. నటనపై ఉన్న ఆసక్తితో మెడిసిన్ చదివి.. సినిమాల్లోకి అడుగుపెట్టింది.

మొదట పలు యాడ్స్ ద్వారా మోడల్‌గా పాపులర్ అయిన ఐశ్వర్య లక్ష్మీకి.. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.2017లో మలయాళ చిత్రం 'మాయానది' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది.

2019లో 'యాక్షన్' మూవీతో ఐశ్వర్య లక్ష్మీ తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక ఇటీవల విష్ణు విశాల్‌తో చేసిన 'గట్ట కుస్తీ' మూవీతో ఆమెకు అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.

మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్స్‌లోనూ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూంగుళీ పాత్రతో తన నటనతో మెప్పించింది ఐశ్వర్య లక్ష్మీ. ఇక ప్రస్తుతం నటి ఐశ్వర్య లక్ష్మీ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.




