- Telugu News Photo Gallery Cinema photos Adivi Sesh Goodachari 2 movie update and release date details on 15 12 2023 Telugu Entertainment Photos
Adivi Sesh – Goodachari-2: గూడఛారి 2 ముచ్చట్లేంటి.? అప్పుడెప్పుడో అనౌన్స్‌మెంట్.. ఇప్పటికి నో అప్డేట్.
గూడఛారి 2 షూటింగ్ ముచ్చట్లేంటి..? అసలు ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది..? అప్పుడెప్పుడో 2022 డిసెంబర్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.. ఏడాది అవుతున్నా ఈ చిత్ర అప్‌డేట్స్ మాత్రం రావట్లేదు. అసలు గూడఛారి 2కు ఏమైంది.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు.? పాన్ ఇండియన్ సినిమా కాబట్టే ఆలస్యమవుతుందా..? పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకుపోతున్న అభిషేక్ అగర్వాల్.. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్మెంట్స్..
Updated on: Dec 15, 2023 | 2:59 PM

గూడఛారి 2 షూటింగ్ ముచ్చట్లేంటి..? అసలు ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది..? అప్పుడెప్పుడో 2022 డిసెంబర్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.. ఏడాది అవుతున్నా ఈ చిత్ర అప్‌డేట్స్ మాత్రం రావట్లేదు. అసలు గూడఛారి 2కు ఏమైంది.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు..?

పాన్ ఇండియన్ సినిమా కాబట్టే ఆలస్యమవుతుందా..? పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకుపోతున్న అభిషేక్ అగర్వాల్.. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్మెంట్స్.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

ఈ మూడు నిర్మాణ సంస్థలు కలిపి ఓ పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నాయి.. అదే గూడఛారి 2. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. 2018లో వచ్చిన గూఢచారి మంచి విజయం సాధించింది.

దాని తర్వాతే ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో మరింత మార్కెట్ పెంచుకున్నారు శేష్. గూఢచారి విడుదలైనపుడే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే మిగిలిన సినిమాల గోలలో పడి కొన్నాళ్లు పక్కనబెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు మోక్షం వచ్చింది.

మూడు లీడింగ్ నిర్మాణ సంస్థలు కలిపి గూఢచారి 2 సీక్వెల్ నిర్మిస్తున్నాయి. గూఢచారి 2ను పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు శేష్. అందుకే అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్, అనిల్ సుంకర లాంటి నిర్మాతలతో ముందుకెళ్తున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు ట్వీట్ చేసారు మేకర్స్. అయితే ప్రస్తుతం మొదలైంది సెట్ వర్క్ అని.. అసలు షూటింగ్ డిసెంబర్ 20 తర్వాతే షురూ కానుందని తెలుస్తుంది. భానితా సంధు ఇందులో హీరోయిన్. గూఢచారిలో అడివి శేష్ హీరో మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు.

సీక్వెల్‌కు కూడా స్క్రిప్ట్ వర్క్‌లో భాగం అవుతున్నారీయన. అయితే దర్శకుడిగా మాత్రం శశికిరణ్ తిక్కా స్థానంలోకి వినయ్ కుమార్ సిరిగినీడి వచ్చారు. కొన్ని కీలకమైన కారణాల దృష్ట్యా శశికిరణ్‌తో చర్చించిన తర్వాతే.. గూడఛారి 2కు వినయ్ కుమార్‌ను దర్శకుడిగా తీసుకున్నట్లు తెలిపారు అడివి శేష్.




