- Telugu News Photo Gallery Cinema photos Actress Varalaxmi Sarathkumar Invites PM Narendra Modi For Her Reception Photos Viral telugu cinema news
Varalaxmi Sarathkumar: తన పెళ్లికి పీఎం మోదీని అహ్వానించిన వరలక్ష్మి.. తండ్రికి థాంక్స్ చెబుతూ పోస్ట్..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్గా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన వరలక్ష్మి ఇప్పుడు ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం రెండు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా జరిగింది.
Updated on: Jun 29, 2024 | 12:53 PM

సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్గా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన వరలక్ష్మి ఇప్పుడు ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్దేవ్ ని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం రెండు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా జరిగింది. అలాగే తన పెళ్లిని కూడా సింపుల్ గానే చేసుకుంటున్న రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్ గా చేయనున్నట్లు సమాచారం.

తన రిసెప్షన్ కు రమ్మని కొన్ని రోజులుగా పలువురు సెలబ్రెటీలను స్వయంగా కలుస్తూ ఆహ్వానిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలోని చాలా మంది తారలను రిసెప్షన్ కు ఆహ్వానించిన వరలక్ష్మి ఇప్పుడు పీఎం మోదీని కలిసింది.

తన పెళ్లికి రావాలని పీఎం మోదీని ఆహ్వానించింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్, రాధిక, కాబోయే భర్త నికోలయ్ సచ్ దేవ్ లతో కలిసి పీఎం మోదీని కలిసి అహ్వాన పత్రికను అందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తండ్రికి థాంక్స్ చెప్పింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మోదీగారు మీ అద్భుతమైన స్వాగతంకు ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యుల్లో మాతో మంచి సమయం గడిపారు. మాకు చాలా గౌరవంగా ఉంది. థాంక్యూ నాన్న మోదీ గారిని కలిసేలా చేసినందుకు అంటూ పోస్ట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.




