- Telugu News Photo Gallery Cinema photos Actress tamannah finished her part shoot in nithiin maestro movie
Tamannah: ‘కఠిన సమయంలో షూటింగ్ జరపడం పెద్ద సవాల్.. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం’.. తమన్నా..
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అటు వెబ్ సిరీస్ చేస్తూనే తమన్న ఇటు పలు సినిమాలను కూడా చక చక పూర్తి చేసేస్తూ తెగ కష్టపడిపోతుంది.
Updated on: Jun 16, 2021 | 9:28 PM

ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ తమన్నా.. నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మాస్ట్రో' సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘అంధాదూన్’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో నబా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

హిందీలో టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. కాస్తా ప్రతినాయికగా.. సవాళ్ళతో కూడిన పాత్రలో తమన్నా నటిస్తోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నా అంటూ తమన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మాస్ట్రోలో నా పాత్ర చిత్రీకరణ పూర్తైంది. ఈ క్లిష్ట సమయంలో చిత్రీకరణ జరపడం సవాల్ తో కూడిన పనే. అయినా మేము దాన్ని విజయవంతంగా పూర్తి చేశాం.. సినిమాను వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా... త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. అంటూ ట్విట్ చేసింది.

తమన్నా ప్రస్తుతం.. గోపిచంద్ సరసన సీటిమార్.. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కు జోడీగా గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది.




