- Telugu News Photo Gallery Cinema photos Actress Samyuktha Next Movie with Allu Arjun in Trivikram Direction telugu cinema news
Samyuktha : గోల్డెన్ బ్యూటీకి మరో ఛాన్స్.. మాటల మాంత్రికుడి సినిమాలో ఆఫర్ కొట్టేసిందిగా..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సంయుక్త. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ కుట్టి. ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవల విరూపాక్ష మూవీతో మరో హిట్టు కొట్టింది.
Updated on: May 05, 2023 | 3:53 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సంయుక్త. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ కుట్టి.

ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవల విరూపాక్ష మూవీతో మరో హిట్టు కొట్టింది.

దీంతో వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో నటిస్తుంది.

తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.లేటేస్ట్ సమాచారం ప్రకారం సంయుక్త నెక్ట్స్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఉండబోతుందట.

ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ ఈ మూవీ తర్వాత బన్నీతో చేయనున్నారట. ఇందులో బన్నీ జోడిగా సంయుక్త నటించనుందని టాక్.

గోల్డెన్ బ్యూటీకి మరో ఛాన్స్.. మాటల మాంత్రికుడి సినిమాలో ఆఫర్ కొట్టేసిందిగా..




