- Telugu News Photo Gallery Cinema photos Actress Parvati Nair says that she made a big mistake by rejecting Arjun Reddy's offer telugu cinema news
Parvati Nair: అర్జున్ రెడ్డి ఆఫర్ వదలుకుని చాలా పెద్ద తప్పు చేశానంటున్న హీరోయిన్.. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు విజయ్. డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా హీరో విజయ్.. హీరోయిన్ షాలిని క్రేజ్ తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా ఆఫర్ వదులుకుని తప్పు చేశానంటుంది ఓ ముద్దుగుమ్మ.
Updated on: Jan 12, 2023 | 8:40 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు విజయ్. డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా హీరో విజయ్.. హీరోయిన్ షాలిని క్రేజ్ తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా ఆఫర్ వదులుకుని తప్పు చేశానంటుంది ఓ ముద్దుగుమ్మ.

తన వరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని.. కేవలం లిప్ లాక్ సీన్స్..రొమాన్స్ సీన్స్ ఉండడమే అందుకు కారణమని.. కానీ రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశానంటుంది హీరోయిన పార్వతి నాయర్.

ఉత్తమ విలన్, మాలై నేరత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్ చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్వతి తన కెరీర్ గురించి.. వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.

ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని.. అది జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని.. అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది పార్వతి. కానీ అదృష్టాన్ని తాను మిస్ చేసుకున్నానని చెప్పింది.

తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి లో తాను కథానాయికగా నటించాల్సి ఉందని.. కానీ అందులో లిప్ లాక్స్ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో తాను నిరాకరించినట్లు పేర్కొంది.

కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డానని.. అర్జున్ రెడ్డి సినిమా ఓ అందమైన చిత్రమన తెలిపింది. ఆ మూవీ ఆఫర్ వదలుకుని పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అలాగే కమల్ హాసన్ తో నటించడం తనకు అద్భుత అవకాశమని.. ఆ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేనని చెప్పింది. కమల్ తో నటించడం ఇప్పటికీ నమ్మలేనని చెప్పింది.

అర్జున్ రెడ్డి ఆఫర్ వదలుకుని చాలా పెద్ద తప్పు చేశానంటున్న హీరోయిన్.. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే..

హీరోయిన్ పార్వతి నాయర్.

హీరోయిన్ పార్వతి నాయర్.

హీరోయిన్ పార్వతి నాయర్.




