- Telugu News Photo Gallery Cinema photos Actress Mannara Chopra shocking comments on director AS Ravi Kumar kiss in Bigg Boss show
Mannara Chopra: బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ.. డైరెక్టర్ ముద్దు పెట్టడంపై షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాలకు సమీప బంధువైన మన్నారా చోప్రా హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. ప్రేమ గీమా జాన్తా నై మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె జక్కన్న, తిక్క, రోగ్, సీత తదితర సినిమాల్లో తళుక్కుమంది.
Updated on: Oct 16, 2023 | 9:58 PM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాలకు సమీప బంధువైన మన్నారా చోప్రా హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. ప్రేమ గీమా జాన్తా నై మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె జక్కన్న, తిక్క, రోగ్, సీత తదితర సినిమాల్లో తళుక్కుమంది.

అయితే మన్నారా చేసినవన్నీ గ్లామర్ రోల్సే. దీంతో ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఇటీవలే రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.

గతంలో యజ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన ఏ ఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తిరగబడరా సామి అనేది ఈ సినిమా టైటిల్.

అయితే ఈ సినిమా ఈవెంట్‌లో డైరక్టర్ రవికుమార్ చౌదరి మన్నారా బుగ్గపై పబ్లిక్‌గా ముద్దు పెట్టడం చర్చనీయాంశమైంది. చాలామంది డైరెక్టర్‌ను ట్రోల్ చేశారు.

తాజాగా బిగ్‌బాస్ హిందీ సీజన్ 17లోకి అడుగపెట్టిన మన్నారా ఈ ముద్దు వ్యవహారంపై స్పందించింది. సల్మాన్ గురించి అడిగిన ప్రశ్నకు.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా డైరెక్టర్ తనకు పెక్ తరహా ముద్దు పెట్టారని క్లారిటీ ఇచ్చింది.