- Telugu News Photo Gallery Cinema photos Actress Laya Shares Her Daughter Sloka Birthday Celebration Photos Goes Viral
Tollywood : అయ్య బాబోయ్.. లయ కూతురిని చూశారా.. ? అచ్చం హీరోయిన్లా..
చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది హీరోయిన్ లయ. ప్రస్తుతం నితిన్ నటిస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ లయ కూతురి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే తన కూతురిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది.
Updated on: Jun 26, 2025 | 12:02 PM

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు లయ. అందం, అభినయంతో ఇండస్ట్రీలో సత్తా చాటిన అచ్చ తెలుగమ్మాయి. ఆనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సహజమైన యాక్టింగ్... చక్కని చిరునవ్వుతో జనాల హృదయాలను గెలుచుకుంది. భద్రం కొడుకో సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత హీరో వేణు తొట్టెంపూడి నటించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు క్యూకట్టాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సంప్రదాయంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. దాదాపు పదేళ్లపాటు సినీరంగంలోకి చక్రం తిప్పిన లయ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నివసిస్తుంది లయ.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ.. అమెరికాలో ఐటీ జాబ్ చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ రీల్స్, ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. కొన్నాళ్లుగా లయ డ్యాన్స్ వీడియోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. అలాగే పలు యూట్యూబ్ ఛానల్స్ కు సైతం ఇంటర్వ్యూస్ ఇచ్చింది.

తాజాగా లయ తన కూతురు శ్లోక బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై శ్లోక ప్రిన్సెస్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. నా లిటిల్ సన్ షైన్ కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం లయ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం లయ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శ్లోక ఇదివరకు రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆమె బాలయ్య నటిస్తున్న అఖండ 2 చిత్రంలోనూ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.




