- Telugu News Photo Gallery Cinema photos Bhagyashri Borse Will Replace Sreeleela Role In Akhil Akkineni Upcoming Movie Lenin
Telugu Cinema: చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ముద్దుగుమ్మకు క్యూ కట్టిన ఆఫర్స్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సినీరంగంలో గుర్తింపు రావాలంటే.... అందం, అభినయం మాత్రమే కాదు.. కాసింత అదృష్టం కూడా ముఖ్యమే అని నిరూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమె చేసిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గడం లేదు.
Updated on: Jun 26, 2025 | 12:27 PM

తెలుగు సినీరంగంలో ఇప్పుడిప్పుడే తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో భాగ్య స్రీ బోర్సే ఒకరు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమా విడుదలకు ముందే అందంతో కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమా సమయంలో ఈ అమ్మాడి పేరు మారుమోగింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ అమ్మడు మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ ఈ బ్యూటీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన కాంత చిత్రంలో నటిస్తుంది భాగ్యశ్రీ.

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోడిగా కింగ్ డమ్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ విడుదలయ్యాయి. వీటితోపాటు రామ్ పోతినేని సరసన ఓ సినిమాలో నటిస్తుందట భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం. అలాగే తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్.

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా లెనిన్. డైరెక్టర్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలు ఉండడంతో ఈ సినిమాకు ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట.

దీంతో లెనిన్ సినిమా నుంచి తప్పుకుందని.. ప్రస్తుతం మేకర్స్ మరో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సేను సెలక్ట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ బ్యూటీ.




