Rajitha Chanti |
Updated on: Mar 04, 2023 | 9:18 PM
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తొలి చిత్రంతోనే అందంతో.. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ ఉత్తరాది భామ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా విడుదలైన 10 సంవత్సరాలు పూర్తైంది.
ఈ సినిమా తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అయ్యింది.
అయితే నిత్యం ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ మాత్రం తెగ చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా లావణ్య... వరుణ్ ప్రేమాయణం అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది.
ఈ రూమర్స్ పై వీరిద్దరూ పలు మార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. తాజాగా తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది లావణ్య.
ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని.. టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని చెప్పింది. అసలు పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదని తెలిపింది.
తాను పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని.. అందుకు సంబంధించిన కలలు కూడా తనకు లేవని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపైనే ఉందని.
పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని.. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పడం తనకు ఇష్టం ఉండదని వ్యాఖ్యనించింది.
అదుర్స్ అనేలా అందాల రాక్షసి అందాలు.. చీరకట్టులో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతోన్న బ్యూటీ.