Rajitha Chanti | Edited By: Phani CH
Updated on: Mar 22, 2023 | 10:47 PM
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కియార.. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ కు మకాం మార్చేసింది.
ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది కియారా. అటు మ్యారెజ్ తర్వాత ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తుంది.
తాజాగా తన సమ్మర్ స్కిన్ కేర్ సీక్రెట్ బయటపెట్టింది కియారా. ఇందుకు నిత్యం హైడ్రేట్ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటుందట.
ప్రోటీన్, వాటర్ కంటెట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ చర్మాన్ని సంరక్షించుకుంటానని తెలిపింది.
అమ్మాడి అందానికి రహస్యం ఇదే.. సమ్మర్ స్కిన్‌కేర్ సీక్రెట్ బయటపెట్టిన కియారా..