- Telugu News Photo Gallery Cinema photos Actress Kavya Thapar shared her latest beautiful photos near mountain
Kavya Thapar: ప్రకృతిని ఆస్వాదిస్తున్న అందాల భామ.. కావ్య థాపర్ కొత్త ఫోటోలు
టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది కొత్త భామలు తమ నటనతో పాటు అందచందాలతోనూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో హాట్ బ్యూటీ కావ్య థాపర్ ఒకరు.ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది.
Updated on: Mar 12, 2025 | 8:55 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది కొత్త భామలు తమ నటనతో పాటు అందచందాలతోనూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో హాట్ బ్యూటీ కావ్య థాపర్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. కావ్య హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఈ మాయ పేరేమిటో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ అనే సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ భామ తన అందచందాలతో మెప్పించింది.

కాగా ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టించేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది కావ్య. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























