- Telugu News Photo Gallery Cinema photos Actress Kalyani Priyadarshan Waiting For Telugu Movie Offers
Actress: చేసిందే మూడు సినిమాలు.. ఒకటి బ్లాక్ బస్టర్.. రెండు డిజాస్టర్స్.. అయినా తగ్గని క్రేజ్..
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ సక్సెస్ మాత్రం కాలేకపోయింది. తమిళం నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం మలయాళంపై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు.
Updated on: Aug 08, 2025 | 6:52 PM

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిందే మూడు సినిమాలు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కానీ అందం, అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలు దోచేసింది.

తెలుగులో అంతగా సక్సెస్ రాకపోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తెలుగులో కాకుండా తమిళం, మలయాళం సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ జోడిగా చిత్రలహరి సినిమాతో హిట్టు అందుకుంది.

చిత్రలహరి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమా తర్వాత శర్వానంద్ సరసన రణరంగం సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. కానీ మలయాళంలో మాత్రం వరుసగా విజయాలు అందుకుంటుంది.

తెలుగులో మంచి అవకాశం వస్తే చేసేందుకు రెడీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన బ్యూటీఫుల్ సింపుల్ లుక్స్ తెగ వైరలవుతున్నాయి. ఎప్పటిలాగే సింపుల్ లుక్ లో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.




