- Telugu News Photo Gallery Cinema photos Actress Anikha Surendran Shares Latest Photoshoots In Her Instagram telugu movie news
Anikha Surendran: ఆ విషయంలో రిస్క్ చేస్తోన్న అనిక.. అయినా ఆ హీరోయిన్ను పట్టించుకోరేంటీ.. ?
కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేందర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించింది. కానీ అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతోనే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చాలా మంది బాలతారల మాదిరిగానే ఇప్పుడు అనిక హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది.
Updated on: Apr 11, 2024 | 6:31 PM

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేందర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించింది. కానీ అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతోనే పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత తమిళంలో, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చాలా మంది బాలతారల మాదిరిగానే ఇప్పుడు అనిక హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది.

కానీ ఈ మూవీ ఆశించిన స్తాయిలో మెప్పించలేకపోయింది. దీంతో అనికకు సరైన గుర్తింపు రాలేదు. అయినా ఏమాత్రం తగ్గకుండా ఆఫర్స్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇందుకు సోషల్ మీడియానే ఎంచుకుంది అనిక.

కొన్నాళ్లుగా వరుస ఫోటోషూట్స్ షేర్ చేసిన అనిక.. ఇప్పుడు రూటు మార్చింది. ట్రెడిషనల్ కాకుండా గ్లామర్ లుక్స్‌తో కట్టిపడేస్తుంది. తాజాగా రెడ్ లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోయింది. అంతకు ముందు గ్లామర్ ట్రెండీ స్టైల్లో షాకిచ్చింది.

ఇక తర్వాత సిల్క్ స్మితను గుర్తుచేసింది. తెల్ల చీరకట్టులో ఫోటోషూట్ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. మరో సిల్క్ స్మిత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రంలో అనిక ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.




