- Telugu News Photo Gallery Cinema photos Vithika Sheru Shares Latest Stunning Treditional Photos with Saree telugu movie news
Vithika Sheru: మహాలక్ష్మిగా ముస్తాబైన వితికా షేరు.. ఈ నిండు చందమామను చూసేందుకు రెండు కళ్లు చాలవే..
2008లో ఓ కన్నడ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రేమించే రోజుల్లో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట పాల్గొన్నారు. తమదైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.
Updated on: Apr 12, 2024 | 10:40 AM

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు వితిక షేరు. 11 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా అలరించింది.

2008లో ఓ కన్నడ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రేమించే రోజుల్లో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట పాల్గొన్నారు. తమదైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా వితిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ముద్ద మందారంలా కనిపిస్తుంది.

పట్టు చీరలో.. మెడలో హారం.. బంగారు ఆభరణాలతో అచ్చం మహాలక్ష్మిలా ముస్తాబయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అచ్చం అమ్మోరు రూపంగా కనిపిస్తుందని.. ఎంతో అందంగా ఉందని. రెండు కళ్లు చాలవంటూ కామెంట్స్ చేస్తున్నారు.




