- Telugu News Photo Gallery Cinema photos Actress aishwarya rajesh says she wants to go to dinner with actor vijay
Aishwarya Rajesh: ఆ హీరోతో డిన్నర్‌కు వెళ్తా.. మనసులో మాట బయట పెట్టిన ఐశ్వర్య రాజేష్
సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
Updated on: Aug 05, 2024 | 1:50 PM

సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

నటుడు దినేష్ హీరోగా బా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అట్టకత్తి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. సినిమాలో ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య రాజేష్ సుపరిచితురాలే.. ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2018లో అరుణ్‌రాజా కామరాజ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఐశ్వర్య రాజేష్ నటించిన చిత్రం 'కనా'. ఇదే సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది.

హీరోయిన్ సెంట్రిక్ కథలను ఎంచుకుని నటిస్తూ ఉంది ఈ అమ్మడు. ఈ అమ్మడి చివరి చిత్రం పులిమాడ. కరుప్పర్ నగరన్, మోహన్ దాస్, తీవర్ గులై నడుంగ వంటి తదుపరి చిత్రాలు విడుదల కానున్నాయి.

ఓ షోకు హాజరైన ఐశ్వర్య రాజేష్‌ను ఏ హీరోతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె దళపతి విజయ్‌తో డిన్నర్‌కి వెళ్లాలని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




