- Telugu News Photo Gallery Cinema photos Actress Abhinaya enjoys bachelor party with her fiance photos
కాబోయే భర్తతో బ్యాచ్లర్ పార్టీ చేసుకున్న నటి అభినయ.. బ్యూటిఫుల్ ఫొటోస్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లిగా నటించిన ముద్దుగుమ్మ అభినయ. ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఈ క్రమంలోనే ఈ అందాల ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్తతో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 09, 2025 | 8:46 PM

పూరీ జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన నేనింతే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ అభినయ. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయ ఈ బ్యూటీ సొంతం.

పుట్టుకతోనే మూగ , చెవుడు అయినా ఒక నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, మళయాలం, తమిళంలో చాలా సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకుంది ఈ నటి.

ఇక ఈ మధ్య నటుడు విశాల్ తో ప్రేమలో ఉందంటూ పుకార్లు రాగా, వాటన్నింటికి చెక్ పెడుతూ తాను 15 సంవత్సరాలుగా తన స్నేహితుడిని ప్రేమిస్తున్నాను అని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తెలిపిన విషయం తెలిసిందే.

ఇక మార్చి 9న ఘనంగా వీరి వివాహం జరగగా, త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది ఈ కుందనపు బొమ్మ. తన చిరకాల స్నేహితుడు, కాబోయే భర్త సన్నీ వర్మ తో కలిసి బ్యాచ్ లర్ పార్టీ చేసుకుంది.

దీనికి సంబంధించిన ఫొటోలు ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన కాబోయే భర్త, స్నేహితులతో ఈ అమ్మడు చాలా ఎంజాయ్ చేస్తుంది.



