- Telugu News Photo Gallery Cholesterol Control Habits: Cholesterol In Body Can Control By These Habits
Cholesterol Control Habits: ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ సింపుల్ అలవాట్లు పాటించాలి.. అవేంటంటే
గుండె మన శరీరంలోని ప్రధాన అవయవం. గుండె ఆరోగ్యం ఎక్కువగా కొలెస్ట్రాల్‌పై ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలలో హెచ్చుతగ్గులు తలెత్తితే గుండె సమస్యలకు దారితీస్తాయి. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉత్పత్తి అయ్యే జిగట పదార్థం. కొలెస్ట్రాల్ రెండు రకాలు - మంచి, చెడు. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ఎంత మేలు చేస్తుందో, చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది..
Updated on: May 30, 2024 | 9:00 PM

గుండె మన శరీరంలోని ప్రధాన అవయవం. గుండె ఆరోగ్యం ఎక్కువగా కొలెస్ట్రాల్‌పై ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలలో హెచ్చుతగ్గులు తలెత్తితే గుండె సమస్యలకు దారితీస్తాయి. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉత్పత్తి అయ్యే జిగట పదార్థం. కొలెస్ట్రాల్ రెండు రకాలు - మంచి, చెడు. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ఎంత మేలు చేస్తుందో, చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ స్థాయిలు ఆహారం, దినచర్య ద్వారా నియంత్రించబడతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి దినచర్యలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. అందుకు ప్రతిరోజూ అల్పాహారంలో ఓట్స్, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే, ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ తాగాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

మీకూ అధిక కొలెస్ట్రాల్ ఉంటే వేయించిన జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి. ఇంట్లో తయారుచేసిన నూనె-మసాలా ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. బదులుగా కూరగాయలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి

ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయలేకపోతే కేనీసం వాకింగ్ అయినా చేయాలి. నడక, వ్యాయామం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.




