- Telugu News Photo Gallery Chemical Free Vegetables: Effective ways get rid of pesticides in your fruits and Vegetables
Chemical Free Food: కూరగాయలు, పండ్లపై రసాయనాలను తొలగించే చిట్కాలు.. రోజూ ఇలా శుభ్రం చేసి వాడేయండి
ఈ రోజుల్లో పంటలకు రసాయనాల వాడకం సాధారణమై పోయింది. కూరగాయలు, పండ్లను పండించే రైతులు కీటకాల నుంచి కాపాడేందుకు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. అలాగే దిగుబడి రేటు పెంచడానికి కూడా రకరకాల రసాయనాలు, పురుగుమందులు వాడుతున్నారు. అయితే ఇలా రసాయనాలు చల్లి పండించిన ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే కూరగాయల నుంచి రసాయనాలను ఎలా తొలగించి..
Updated on: Aug 25, 2024 | 12:56 PM

మనం రోజు తీసుకునే ఆహారంలో పచ్చి కూరగాయలు చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కూరగాయల నుండి శరీరానికి విటమిన్లు, ఐరన్, అవసరమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కూరగాయలు పచ్చిగా తినలేము. ఎందుకంటే అవి ఉడికించిన తర్వాత మాత్రమే మెత్తగా, రుచిగా ఉంటాయి. దాని సెల్యులార్ నిర్మాణం విచ్ఛిన్నమవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతే కాదు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ కూడా తొలగిపోతాయి. కానీ కూరగాయలకు సంబంధించి తరచుగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే వాటిని ఏ విధంగా తింటే ప్రయోజనకరంగా ఉంటుంది? అందరిలో మెదిలే ప్రశ్న.

పచ్చి కూరగాయలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉడికించిన కూరగాయలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. రెండు రకాల కూరగాయలు తినడం శరీరానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అవి కూరగాయల రకాన్ని బట్టి ఉంటాయి.

విటమిన్ సి వంటి మూలకాలను నాశనం చేస్తాయని చాలా మంది అంటుంటారు. ఇది కూడా పూర్తిగా సరైనదే. కొన్ని కూరగాయలను పచ్చిగానూ, మరికొన్నింటిని ఉడికించినూ తినాలి.




