చాణక్య నీతి : వీరి చేతిలో డబ్బు నిలవడం కష్టం!
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు,రాజకీయ గురువు. అంతే కాకుండా ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరంగా తెలియజేశాడు. అదే విధంగా ఆయన డబ్బు గురించి చెబుతూ.. కొంత మంది చేతిలోఎప్పుడూ డబ్బు ఉండదు, దానికి వారి అలవాట్లే కారణం అని చెప్పుకొచ్చారు. కాగా, ఎలాంటి వారి చేతిలో డబ్బు నిలవదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Aug 06, 2025 | 4:33 PM

ప్రతి ఒక్కరూ కష్టపడేది మనీ సంపాదించుకోవడం కోసమే. రోజూ ఎంతో కొంత సంపాదించి జీవనం సాగిస్తుంటారు. కానీ కొంత మంది ఎంత సంపాదించినా? దానితో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారి చేతిలో రూపాయి కూడా ఉండదు. దాని వలన వారు ఎంత సంపాదించినా మళ్లీ ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతుంటారు. కాగా, అలా డబ్బు సంపాదించినా ఇబ్బందులు పడటానికి ముఖ్య కారణం వారి అలవాట్లేనంట. వాటి మార్చుకోవడం వలన ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చాణక్యుడు మాట్లాడుతూ, ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఖర్చు చేస్తాడో, ముఖ్యంగా ఆదాయానికి మించి ఎవరైతే ఖర్చులు చేస్తారో వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు. అలాంటి వారు ఎంత సంపాదించినా అది వృధానే, అందుకే ఎప్పుడూ కూడా ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చెబుతున్నాడు చాణక్యుడు.

ప్రతి వ్యక్తికి సోమరితనం అనేది పెద్ద శత్రువు. అందుకే ఎవరైతే ఎక్కువ సోమరిగా ఉంటారో, పని చేయడంలోఇబ్బందులు ఎదుర్కోంటారో, ముఖ్యంగా పనిని వాయిదా వేసుకోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, తెలియకుండా అనవసరంగా ఖర్చులు చేయడం, బాధ్యత లేకపోవడం వంటివన్నీ కూడా ఆర్థిక సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నాడు చాణక్యుడు.

అలాగే చాణక్యుడు ఆర్థిక సమస్యలకు అతి పెద్ద కారణం, చెడు అలవాట్లే అని చెప్పుకొచ్చాడు. ఎవరైతే, అధికంగా మద్యంసేవిస్తారో, ఎవరికి ఎక్కువగా చెడు అలవాట్లు ఉంటాయో, అలాగే, అనవసర ఖర్చులు, తమ సంతోషాల కోసం ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారో అలాంటి వారు చాలా ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారని చెప్పుకొస్తున్నాడు చాణక్యుడు.