- Telugu News Photo Gallery Spiritual photos Shani Vakri Unexpected gains for these zodiac signs details in Telugu
Shani Vakri: వక్ర శనితో ఆ రాశులకు ఆకస్మిక శుభాలు.. అనూహ్య ఆదాయం..!
Telugu Astrology: మీన రాశిలో జూలై 13న వక్రించిన శనీశ్వరుడు నవంబర్ 28 వరకూ అదే రాశిలో వక్రగతిలో కొనసాగడం జరుగుతుంది. వక్రగతితో బాగా బలం పుంజుకున్న శనీశ్వరుడు ప్రస్తుతం తన సొంత నక్షమైన ఉత్తరాభాద్రలో సంచారం చేస్తున్నందువల్ల మరింత బలం కూడగట్టుకోవడం జరుగుతుంది. శని బలం పెరగడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కలలో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అనుకోకుండా ఆదాయం పెరగడం, ఊహించని విధంగా ఉద్యోగం లభించడం, అప్రయత్నంగా పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
Updated on: Aug 06, 2025 | 4:32 PM

వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థానంలో వక్రించి బలం పుంజుకోవడం వల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఏదైనా సంస్థలో ఉన్నతాధికారి పదవిని చేపట్టే సూచనలున్నాయి. ప్రయత్నపూర్వకంగానే కాక, అప్రయత్నంగా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఊహించని విధంగా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శని వక్రించడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సం పాదనను అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శనికి బాగా బలం పట్టడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శనికి బలం పెరగడం వల్ల సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన ఆశలు, కోరి కలు తప్పకుండా నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శని వక్రించడం వల్ల పట్టిందల్లా బంగా రం అవుతుంది. ఉద్యోగంలో అనుకోకుండా పదోన్నతులు కలుగుతాయి. అంచనాలకు మించి జీత భత్యాలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులు వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి శ్రద్ధతో కొత్త పుంతలు తొక్కుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా లాభిస్తాయి. జీవనశైలి మారిపోయే అవకాశం ఉంది.



