- Telugu News Photo Gallery Raksha Bandhan 2025: Do not make these mistakes before tying Rakhi to your brother on the festival day, follow these
Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఈ 5 తప్పులు ఎప్పుడూ చేయకండి, ఆలా చేశారో..
రక్షాబంధన్.. అన్నాచెల్లెల ప్రేమ, నమ్మకం, భద్రత, అత్యంత పవిత్రమైన బంధానికి ప్రతీకగా హిందువులు జరుపుకునే పండగా. ఈ పండగకు ఇంకా కేవలం మూడు రోజులే ఉండడంతో తమ్మ అన్నలకు, తమ్ముల కోసం రాఖీలు కొనేందుకు అక్కాచెల్లెల్లు షాపింగ్ మొదలు పెట్టె ఉంటారు. అయితే ఆగస్టు 9, శనివారం నాడు మీ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టే ముందు, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. రాఖీ కట్టెప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.
Updated on: Aug 06, 2025 | 4:43 PM

పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను హిందువులు జరుపుకుంటారు. రక్షా పండుగ కేవలం రాఖీ కట్టడానికే పరిమితం కాదు, అన్నా చెల్లెల్ల, అక్కాతమ్ముళ్ల మధ్య బలమైన బంధానికి ప్రతీకా. అందుకే మీరు రాఖీ పండుగ రోజులు మీ సొదరులకు రాఖీ కట్టుప్పుడు మీరు శుభ సమయం, సరైన పద్ధతి, సరైన దిశ మొదలైన అనేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం తెలిసో, తెలికో చేసే ఈ తప్పుడు కొన్నిసార్లు మన బంధంలో సమస్యలను తీసుకురావచ్చు.

అందుకోసమే మీ సోదరులకు రాఖీ కట్టేది శుభ సమయం అయి ఉండేలా చూసుకోండి. పంచారంగ ప్రకారం ఆగస్ట్ 9, రాఖీ పండగ రోజున ఉదయం 05:57 నుండి మధ్యాహ్నం 01:24 వరకు శుభసమయం ఉంటుందిని జ్యోతిష్యులు చెబుతున్నారు. కావును మీరు లేచిన వెంటనే రాఖీ కట్టలేరు కాబట్టి.. ఆ తర్వాత శుభ సమయంలో మాత్రమే మీ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం మంచిది.

రక్షా బంధన్ రోజున, రాహుకాలం, భద్రకాల సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి. ఈ రెండు సమయాలను రాఖీ కట్టడానికి అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ సంవత్సరం, భద్ర రక్షా బంధన్ పై తన నీడ పడదు. కానీ ఆగస్టు 9న ఉదయం 9:00 గంటల నుండి ఉదయం 10:30 గంటల వరకు రాహుకాలముంటుంది. కాబట్టి రాఖీ ఎప్పుడు కట్టాలో ఒకసారి జ్యోతిష్యుడిని సంప్రదించండి

మనం రాఖీ కట్టే ముందు దాన్ని ఒక ట్రేలో తీసుకెళ్తాం.. అయితే ఆ ట్రేలో ఈ వస్తువులను ట్రేలో ఉంచండి. రాఖీ కట్టే ముందు, ట్రేని సరిగ్గా సిద్ధం చేసుకోండి. అందులో అక్షత, స్వీట్లు, రాఖీ, ఉంగరం, తమలపాకు, నాణెం మొదలైనవి ఉంచేలా చూసుకోండి. ఈ వస్తువులు లేకుండా, రక్షా బంధన్ తాళి అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

రాఖీ కట్టేటప్పుడు సైరన దిశను గుర్తుంచుకోండి. రాఖీని దక్షిణ దిశకు ఎదురుగా కట్టకూడదు. వాస్తు శాస్త్రాల ప్రకారం, తూర్పు లేదా ఉత్తర దిశకు ఎదురుగా రాఖీ కట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకో విషయం, కొందరు రాఖీ కట్టేప్పుడు నల్ల దుస్తులు ధరిస్తారు. హిందూ మతంలో నలుపును అశుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో, ఇది ప్రతికూలతతో ముడిపడి ఉంది. కాబట్టి, రక్షా బంధన్ రోజున, సోదరులు, సోదరీమణులు నల్లని దుస్తులు ధరించకూడదు. అంతే కాకుండా నల్ల రాఖీలను కూడా కట్టకూడదు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉన్న నివేదికలు, జ్యోతిష్య నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మేము దాని గురించి ఎటువంటి వాస్తవాలను క్లెయిమ్ చేయము. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరగా ఉన్న జ్యోతిష్యులను సంప్రదించవచ్చు)!




